కార్తీ.. ‘సర్దార్ 2’

22
- Advertisement -

హీరో కార్తీ ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో బంపర్ హిట్ అయ్యింది. సర్దార్ థియేటర్స్ లో విడుదలైన కొద్ది రోజుల తర్వాత మేకర్స్ సినిమా పార్ట్ 2ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సర్దార్ 2కి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి, ఈ సినిమా షూటింగ్ 2024 జూలై 15న చెన్నైలో భారీ సెట్స్‌లో ప్రారంభం కానుంది. ప్రీక్వెల్‌కి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ సర్దార్ 2కి దర్శకత్వం వహించనున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది.

సర్దార్ ఎండింగ్ లో నెక్స్ట్ మిషన్ కంబోడియాలో జరగబోతోందని రివిల్ అయ్యింది. సర్దార్ 2 భారీ బడ్జెట్‌తో హ్యుజ్ స్కేల్ లోతెరకెక్కనుంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు.

సర్దార్ 2 చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించనున్నారు. జార్జ్ సి విలియమ్స్ ఫోటోగ్రఫీ డైరెక్టర్, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్ డైరెక్టర్. రాజీవ్ నంబియార్ ప్రొడక్షన్ డిజైనర్. విజయ్ వేలుకుట్టి ఎడిటర్. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. ఎ వెంకటేష్ సహ నిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read:సంతోష్ శోభన్..’కపుల్ ఫ్రెండ్లీ’

- Advertisement -