తెలుగు చిత్ర పరిశ్రమలలో పలువురు సినీ ప్రముఖులు తనను లైగింకంగా వేధించారంటూ నటి శ్రీరెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా సైలెంగ్ గా ఉన్న శ్రీరెడ్డి ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియా వేదికగా పలువురుపై ఆరోపణలు చేస్తోంది. కానీ ఈసారి శ్రీరెడ్డి తమిళ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది. మురుగదాస్, రాఘవ లారెన్స్, సి.సుందర్ వంటి సినీ ప్రముఖులు తనను వాడుకుని అవకాశాలు ఇస్తానని చెప్పి మోసం చేశారంటూ ఆరోపించింది.
తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలపై నటుడు, నడిగర్ సంఘం కోశాధికారి కార్తి స్పందించారు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలలో నిజం లేదని, సాక్ష్యాలు ఉంటే పోలీసులను ఆశ్రయించకుండా ఇలా సోషల్ మీడియా ద్వారా ఆరోపణలు చేయడం ఏంటని మండిపడ్డారు. ఈ విషయంపై త్వరలో నడిఘర్ సంఘం అధికారిక ప్రకటన జారీ చేస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం గురించి ఇంతకు మించి మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు.
హీరో నానిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలకు.. హీరో విశాల్ స్పందించిన విషయం తెలిసిందే. నాని గురించి తనకు తెలుసని, ఆధారాలు ఉంటే చూపించాలని విశాల్, శ్రీరెడ్డిపై మండిపడిన విషయం తెలిసిందే. చెన్నై లీక్స్ బట్టబయలు చేయనున్న తనకు విశాల్ నుంచి హాని జరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ విషయంపై విశాల్ ఇంకా స్పందించలేదు. కానీ త్వరలోనే శ్రీరెడ్డికి విశాల్ గట్టి సమాధానమే ఇవ్వనున్నాడని టాక్. చూడాలి మరి.. చెన్నై శ్రీరెడ్డి వ్యవహారం ఎంతవరకు వస్తుందో..?