Karthi:’మిస్టర్. X’ షూటింగ్ పూర్తి

10
- Advertisement -

స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్ లో మను ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. స్టార్ యాక్టర్ శరత్ కుమార్, నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. షూటింగ్ లాస్ట్ డేని టీం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ఈ మేరకు స్టిల్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

“మిస్టర్ X” లోని యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరించారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ (మరగధ నానయం, బ్యాచిలర్, కనా & నెంజుకు నీది ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్.

రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, ఇందులాల్ కవీద్ ఆర్ట్ డైరెక్టర్. కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తరా మీనన్. ఏపీ పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, శ్రవంతి సాయినాథ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిస్టర్ X చిత్రానికి ఎ. వెంకటేష్ సహ నిర్మాత.మిస్టర్ X తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Also Read:టీ20లకు గడ్‌బై చెప్పిన కోహ్లీ,రోహిత్

- Advertisement -