కార్తీ… ఖాకి కథే హీరో

238
Karthi Khakee Audio Launch
- Advertisement -

త‌మిళ స్టార్ హీరో కార్తీ తమిళంలో న‌టిస్తున్న మూవీ ‘ధీరమ్ అధిగారమ్ ఒండ్రు. ఈ మూవీని తెలుగులో ‘ఖాకీ’ పేరు తో రిలీజ్ చేయ‌నున్నారు. త‌మిళ‌, తెలుడు భాషల్లో  ఈ సినిమా నవంబర్ 17వ విడుద‌ల కానుండగా కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ తో ఈ మూవీ పై భారీ అంచ‌నాలు నెలకొనగా తాజాగా హైదరాబాద్‌లో ఆడియో రిలీజ్‌ ఫంక్షన్ ఘనంగా జరిగింది.

తొలిసీడీని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన దిల్ రాజు పోలీస్‌ పాత్రలు చేయడం కథానాయకులకు ఓ సవాల్‌. కార్తి చాలా కష్టపడి ఈ పాత్ర పోషించారు. ‘ఉపిరి’తో తెలుగు ప్రేక్షకులకు కార్తి మరింత దగ్గరయ్యారు. ఆయన ప్రతీ యేడాదీ తెలుగులో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలన్నారు.

Karthi Khakee Audio Launch
కార్తి మాట్లాడుతూ ‘‘తమిళ ‘విక్రమార్కుడు’లో పోలీస్‌గా కనిపించాను. ఆ సినిమాకీ ‘ఖాకి’కీ చాలా తేడా ఉంది. 1995 నేపథ్యంలో సాగే కథ ఇది. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ కథని తయారు చేశాడు. జిబ్రాన్‌ పాటలు బాగున్నాయి.  యాక్షన్ సీన్స్‌ సినిమాకే హైలెట్ కానున్నాయని తెలిపారు. నా కెరీర్‌లో చేసిన భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా ఇది. కథలోనే హీరోయిజం ఉంటుంది. మంచి కథలతో వస్తే తెలుగులో మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా  అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ  వినోదాత్మకంగా నడిచే కథ ఇది. రెండున్నర గంటల పాటు థియేటర్లో కూర్చోబెడుతుంది. ప్రేక్షకులకు కొత్త కొత్త అనుభవాలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌.శంకర్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, కె.ఎస్‌.రామారావు, జెమిని కిరణ్‌, లగడపాటి శ్రీధర్‌, రాజా రవీంద్ర, శివలంక కృష్ణప్రసాద్‌, శశాంక్‌ వెన్నెల కంటి, సైలెంద్రబాబు, నర్రా శ్రీనివాస్‌, శ్రీధర్‌రెడ్డి, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Karthi Khakee Audio Launch

- Advertisement -