కార్తీ హీరోగా పి.వి.పి.సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్‌పై గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కాష్మోరా’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 28న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా 1700కిపైగా థియేటర్లలో విడుదల కానున్న కాష్మోరాపై కార్తీ భారీ ఆశలు పెట్టుకున్నారు. కార్తీకి కూడా తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇటీవలె కింగ్ నాగార్జునతో కలిసి ‘ఊపిరి’ సినిమాలో నేరుగా తెలుగులో నటించాడు. ఈ సినిమా విజయంతో తెలుగులోనూ కార్తీ మార్కెట్ బాగా పెరిగింది. ఈ సినిమాలో కార్తీ నటను మంచి మార్కులే పడ్డాయి. దీన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న కార్తీ…తెలుగులో కాష్మోరాను భారీ స్ధాయిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ సినిమాలో కార్తీ…రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు.
కార్తీ కాష్మోరా తమిళ వెర్షన్ కేవలం 400 స్క్రీన్లలో మాత్రమే విడుదలవుతోంది. తెలుగు వర్షన్ ఏకంగా 800కిపైగా స్క్రీన్లలో రిలీజ్ కానుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గోకుల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో పీవీపీ సినిమాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. దీనిని బట్టి చూస్తే కాష్మోరాపై కార్తీ భారీ ఆశలే పెట్టుకున్నాడు.
వాస్తవానికి ఈ సినిమా బాహుబలి మొదటి పార్ట్ సమయంలోనే విడుదలవ్వాల్సి ఉండగా…కావాలనే విడుదలను వాయిదా వేశారట. ఈ సినిమాలో కూడా బాహుబలి తరహాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయట. బాహుబలి సినిమాకు పనిచేసిన యూనిటే ఈ సినిమాకు పనిచేశారు. బాహుబలికి దీటుగా డిజైన్స్ , వి.ఎఫ్.ఎక్స్ వర్క్‌తో సినిమాను తెరకెక్కించారట.ఈ సినిమా వి.ఎఫ్.ఎక్స్‌వర్క్ కోసం 25 కంపెనీలు వర్క్ చేశాయని..90 నిమిషాల పాటు గ్రాఫిక్ వర్క్ ఉండనుందని చిత్ర యూనిట్ ఇటీవలె తెలిపింది. మరి కార్తీ కాష్మోరా…ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా తెలియాలంటే మరో రెండు రోజులు వేచిచూడాల్సిందే.