మోడీ వడ్డీ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారు: కర్నె

375
Karne Prabhakar Slams PM Modi
- Advertisement -

కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని వ్యతిరేకిస్తు ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ మంగళవారం ప్రెస్‌ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలకు చేసింది గుండు సున్నా అని ఎద్దేవ చేశారు. సీఎం కెసిఆర్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి విచిత్రంగా ఒంటి కాలు మీద లేచి స్పందిస్తున్నారు అని కర్నె మండిపడ్డారు. కేంద్రంలో డెబై యేండ్లుగా మోడీ మినహా ఎవ్వరూ ఆర్ధిక క్రమశిక్షణ గురించి ఎవ్వరూ ఆలోచించలేదని కిషన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

కెసిఆర్ సంకుచితంగా వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి అనడంహాస్యాస్పదం. మోడీ ప్రకటించిన ప్యాకేజీని చూసి అందరూ నవ్వుకుంటున్నారు.దేశానికి మోడీ వడ్డీ వ్యాపారి లా వ్యవహరిస్తున్నారు.ఈ సంక్షోభ సమయంలో ప్రజల చేతికి డబ్బు అందించాలని హెలికాఫ్టర్ మనీ గురించి కెసిఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.ఆర్థిక వేత్తలు కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.మోడీ ప్రకటించిన ప్యాకేజీ సామాన్యులకే కాదు బీజేపీ నేతలకు కూడా అర్ధం కావడం లేదు అని కర్నె ప్రభాకర్‌ అన్నారు.

మోచేయితో బెల్లం నాకిచ్చినట్టుగా ఉంది ఈ ప్యాకేజీ. ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో కేంద్రం ఖర్చు పెట్టేది రెండున్నర లక్షల కోట్ల రూపాయలకు మించి ఉండదు. సీఎం కెసిఆర్ నిజాలు మాట్లాడితే కిషన్ రెడ్డికి ఉలికి పాటు ఎందుకు ?.. కిషన్ రెడ్డి గుడ్డిగా మాట్లాడుతున్నారు. రైతు బంధుకు కెసిఆర్ పెట్టే షరతులను రాష్ట్రాలకు కేంద్రం పెట్టే షరతులతో కిషన్ రెడ్డి పోల్చడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనం. విద్యుత్ సంస్కరణల గురించి మాట్లాడుతున్న కిషన్ రెడ్డి ఉచిత విద్యుత్‌కు అనుకూలమా వ్యతిరేకమా ముందు స్పష్టం చేయాలి అని ప్రశ్నించారు.

మోడి ఫ్యూడల్ విధానాలను గట్టిగా వ్యతిరేకించి తీరుతాం. మాతో కలిసి వచ్చే వివిధ రాష్ట్రాల ఎంపీలతో కలిసి పార్లమెంటులో విద్యుత్ బిల్లుపై పోరాడుతాం. ఇపుడు ఆకలై చస్తుంటే ఆరునెలల తర్వాత బిర్యానీ పెడతాం అన్నట్టు ఉంది కేంద్రం ప్యాకేజి. సంస్కరణలు పేదలకు వ్యతిరేకంగా ఉండ కూడదు అనేది టీఆర్‌ఎస్‌ వైఖరి.మేము ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్టు కిషన్ రెడ్డి మాట్లాడుతున్న తీరు నవ్వు తెప్పిస్తోంది. ఇపుడు ఏ ఎన్నికలు ఉన్నాయో కిషన్ రెడ్డి చెప్పాలి. కేంద్రమే ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోంది. పోతిరెడ్డి పాడుపై కెసిఆర్ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరు.కాంగ్రెస్ నేతల విమర్శలు అర్ధ రహితమన్నారు కర్నె ప్రభాకర్.

- Advertisement -