తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ స్వామి పరిపూర్ణానంద పగటికలలు కంటున్నారని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తెలిపారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేతలు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. వివిధ అంశాలపై పార్లమెంట్ లోపల, బయట పోరాడినప్పటికి తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని ఆరోపించారు.
తెలంగాణకు వచ్చిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అబద్దాలు మాట్లాడారని ఆక్షేపించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో నిలదీసినా పట్టించుకోలేదన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం లేదు. ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తేల్చిచెప్పారు.మతాలపై ఆధారపడిన పార్టీ బీజేపీ మరో స్వామిని ఎన్నికల్లోకి తీసుకువచ్చారని మండిపడ్డారు.
పరిపూర్ణానంద ఆంధ్రా ప్రవచనాలను తెలంగాణ మీద రుద్దుతే ఊరుకునేది లేదన్నారు. టీపీసీసీ తన అధికార ట్విట్టర్ ఖాతాలో అన్ని అబద్దాలే ప్రచారం చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ వాస్తవాలు తెలుసుకోవాలని హితవు పలికారు.