కర్ణాటక ఎన్నికల ఫలితాలలో గాలి జనార్దన్ రెడ్డికి ఉహించని షాక్ తగిలింది. అతని కంచుకోటలో పేరున్న బళ్లారి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా 6 స్ధానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఒకవిధంగా ఈ ఫలితాలు మైనింగ్ కింగ్ గాలి జానార్దన్ రెడ్డి పతనానికి నాంది అని చెప్పుకోవచ్చు. మైనింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలికి ఈ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఇవ్వలేదు కోర్టు. దీంతో అతని తరపున తన అనుచరులను రంగంలోకి దింపాడు గాలి. అంతేకాకుండా బళ్లారి జిల్లాలో తన అనుచరులకు బిజెపి నుండి 8 మందికి టికెట్లు ఇప్పించుకున్నాడు.
ఈఅంశంపై కాంగ్రెస్ నేతలు ఎన్ని విమర్శలు చేసినా బిజెపి అధిష్టానం మాత్రం దినిపై స్పందించలేదు. మైనింగ్ కేసులో ఎ1 నిందితుడిగా ఉన్న గాలికి అనుచరులకు టికెట్టు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు. ఇక కర్ణాటక ఫలితాలలో గాలి అనుచరులు కేవలం 3 స్ధానాల్లోమాత్రమే గెలవడంతో బళ్లారిలో కాంగ్రెస్ పార్టీ పాగా వేసింది . ఒకరకంగా ఇది గాలి షాక్ వార్తే అని చెప్పుకొవచ్చు. బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి దగ్గరుండి అన్ని తానై నడిపించినప్పటికి ఫలితం మాత్రం లేకుండాపోయింది. ప్రజల్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉందని వేసింది తేలిపోయింది. ఇక గెలిచిన వారిలో తన తమ్ముళ్ల మాత్రమే ఉండటం విశేషం. బళ్లారి సిటీ నుంచి గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి , సిరిగుప్ప నుంచి సోమలింగప్ప, కూడ్లిగి నుంచి గోపాలకృష్ణలు మాత్రమే గెలుపోందారు.