ఉత్కంఠ రేపిన కర్ణాటక స్పీకర్ విషయం ఓకొలిక్కి వచ్చింది. కర్ణాటక స్పీకర్ గా కాంగ్రెస్ అభర్ధి రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలు రమేష్ కుమార్ కు పూర్తి మద్దతు తెలిపారు. స్పీకర్ పదవికోసం బిజెపి నేతలు వాళ్ల అభ్యర్ధిని నియమించాలని నామినేషన్ వేసిన విషయం తెలిసందే. బీజేపీ నుంచి స్పీకర్ అభ్యర్థిగా ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎస్ సురేశ్‌కుమార్ బరిలోకి దిగి…చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుంది. మరికాసేపట్లో కర్ణాటక సీఎం కుమారస్వామి బల పరీక్ష ఎదుర్కోనున్నారు. కుమారస్వామి బలపరీక్ష కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది
.కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలుండగా, ప్రస్తుతం సీఎం కుమారస్వామి రెండు స్దానాల నుంచి విజయం సాధించారు. దీంతో ప్రస్తుతం 221 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సాధారణ మెజార్టీకి 111 ఓట్లు అవసరం. కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 117 మంది సభ్యుల బలం ఉండటంతో గెలుపుపై ఎలాంటి సందేహం అవసరం లేదని అంటున్నారు. అయితే బీజేపీ పాచిక పారదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. స్పీకర్ గా రమేష్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో నేతలు కాంగ్రెస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.