బీజేపీకి ప్రజా హెచ్చరిక !

54
- Advertisement -

తాము చెప్పిందే శాసనం చేసేదే చట్టం అన్న పంథాలో కేంద్ర బీజేపీ పాలన సాగుతున్న సంగతి తెలిసిందే. ప్రశ్నించే వారిపై కేసులు, ప్రతిపక్షలను గొంతు నోక్కే ప్రయత్నాలు..ఇలా మోడి సర్కార్ సాగిస్తున్న నియంత పాలన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. అయితే ప్రజలు అన్నీ గమనిస్తారని, సరైన టైమ్ లో బుద్ది చెబుతారని ఊహించకపోవడం కమలనాథుల మూర్ఖత్వం. ఇప్పటికే రెండు సార్లు కేంద్రంలో చేపట్టమని వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని విర్రవీగుతున్న హస్తం నేతలకు ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలు పెంపపెట్టు అనే చెప్పవచ్చు. కర్నాటకలో అత్యంత బలమైన పార్టీగా అలాగే అధికార పార్టీగా ఉన్న బీజేపీ నిర్మొహమాటంగా పక్కన పెట్టేశారు ప్రజలు..

అవినీతి ఆరోపణలు నియంతృత్వ పోకడలే కన్నడ నాట బీజేపీని దెబ్బ తీశాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తమకు ఎదురే లేదు.. తిరుగే లేదు అన్న పంథాలో సాగితే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారాని కర్నాటక ఎన్నికలు నిరూపించాయి. కర్నాటక ఎన్నికలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎంతవరుకు ప్రభావితం చేస్తాయో చెప్పలేముగాని.. ఈ ఎన్నికలు బీజేపీకి మాత్రం గట్టి హెచ్చరికే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే మోడి సర్కార్ పై గతంలో కంటే ప్రస్తుతం ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది.

Also Read:మదర్స్ డే.. అమ్మ కు ప్రేమతో

దేశ ప్రజలపై ధరల భారం మోపడం, ఆర్థిక ప్రగతిలో వృద్ది లేకపోవడం, మోడి సర్కార్ ను ప్రశించిన వారిపై కేసులు పెట్టడం.. మత ప్రతిపాధికన ప్రజలలో విద్వేషాలు రెచ్చగొట్టడం,  టోటల్ గా నియంత పాలన కొనసాగించడం వంటి కారణాలతో ప్రజాల్ల వ్యతిరేకత గట్టిగానే ఏర్పడింది. అయినప్పటికి వచ్చే ఎన్నికల్లో కూడా తమదే అధికారం అంటూ జబ్బలు చారుస్తున్నారు కాషాయ నేతలు. అయితే కర్నాటకలో మాదిరి దేశ ప్రజలు కూడా బీజేపీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చెక్ పెట్టె అవకాశం ఉందనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్నా మాట. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -