గర్భం దాల్చిన తర్వాత క్రీడల్లో కొనసాగడం ఎంతో సవాల్‌తో కూడుకున్న విషయం. అలాంటిది 8 నెలల గర్భంతోనే పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం నిజంగా అభినందనీయం. కర్ణాటకకు చెందిన 32 ఏళ్ల షూటర్ మేఘన సజ్జనార్ ఈ అసాధారణ ఘనత సాధించి క్రీడా ప్రపంచం దృష్టిని ఆకర్షించారు.
ఇటీవల జరిగిన ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్లో మేఘన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. వ్యక్తిగత విభాగంలో ఆమె కాంస్య పతకం గెలుచుకోగా, టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నారు. 8 నెలల గర్భంతో ఈ స్థాయి పోటీలో పాల్గొనడమే కాకుండా, అంతర్జాతీయ పతకాలు సాధించడం ఆమె పట్టుదల, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం.
మేఘన సజ్జనార్ సాధించిన ఈ విజయం గర్భిణీలకూ ప్రేరణగా నిలుస్తోంది. సరైన వైద్య పర్యవేక్షణతో, ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చని ఆమె మరోసారి నిరూపించారు.
Also read:TTD:లడ్డూ విక్రయ కేంద్రాల వద్దే UPI పేమెంట్స్

