- Advertisement -
ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటక సర్కార్. ఫుడ్‌లలో కలర్స్ కోసం వాడే కృత్రిమ రంగులను నిషేధించింది ప్రభుత్వం. ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ, ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని వెల్లడించారు అధికారులు.
స్వీట్స్,కబాబ్స్, మంచురియాల్లో కృత్రిమ రంగులు వాడటం ఇకపై నిషేధమని అధికారులు వెల్లడించారు. ఎవరైన ఈ నిబంధనలను అతిక్రమిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా,ఏడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష విధించబడుతుందని అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా అమ్ముడవుతున్న కబాబ్‌లలో కృత్రిమ రంగులు జోడించడం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని అందుకే నిషేధం విధించామని చెప్పారు.
Also Read:కిస్‌మిస్ పండ్లతో ఆరోగ్యం..
- Advertisement -