కర్ణాటకలో బీజేపీ కి షాక్ తగిలింది. ప్రభుత్వ ఏర్పాటుకు సంపూర్ణ మైన మద్దతు రాకున్నా..రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ యడ్యూరప్ప గవర్నర్ ను కోరడంతో… ఇందకు గవర్నర్ కూడా ఒకే చెప్పి యడ్యూరప్ప తో సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేయించారు. ఇక యడ్యూరప్ప ఆనందం ఎంతో కాలం నిలువలేదు. కేవలం రెండు రోజలు సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించాడు. కర్ణాటక రాష్ట్రం తదుపరి సీఎంగా జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి పదవిబాధ్యతలు చేపట్టనున్నాడు. ఈసందర్భంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు. కర్ణాటక ప్రజలకు మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు.
దేవగౌడ జీ, కుమారస్వామిజీ , కాంగ్రెస్, ఇతర నేతలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. రీజనల్ ఫ్రంట్ సాధించిన విజయం ఇది’ అని మమత తన ట్వీట్ లో పేర్కొంది. కర్ణాటక ప్రజలు సంతోష పడే సందర్భం వచ్చిందన్నారు. కర్ణాటకలో ఎలాగైతే బీజేపీ తరిమికొట్టారో…అలాగే దేశంనుంచి బీజేపీ ని తరిమి కొట్టి విముక్తి నుంచి కాపాడాలన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ , జేడీఎస్ విజయం పై కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కూడా ట్వీట్ చేశారు. ‘అయ్యో! మిస్టర్ యడ్యూరప్ప. ఎప్పుడైతే కీలుబొమ్మలనాడించే వారు విఫలమవుతారో, అప్పుడు ఆ కీలు బొమ్మ కింద పడి పగిలిపోతుంది’ అని యాడ్యూరప్పను విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ గెలవడంతో పలువురు నాయకులు అభినందనలు తెలిపారు.