కన్నడలో హంగ్‌..కీలకం కానున్న జేడీఎస్‌..!

341
siddaramaiah
- Advertisement -

దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కర్ణాటక ఎన్నికల ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ జరుగగా 5 గంటల వరకు 65 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.

మొత్తం 222 అసెంబ్లీ స్థానాలకు ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను పరిశీలిస్తే కర్ణాటకలో హంగ్‌ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం మేజిక్ ఫిగర్ 113. జేడీఎస్‌ మద్దతు కీలకంగా మారే అవకాశముందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.వివిధ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన ఫలితాలు..

great telabgaana

- Advertisement -