దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల కన్ను ఇప్పుడు కర్ణాటక వైపే ఉన్నాయి. కర్ణాటకలో బిజెపి విజయం దిశగా దూసుకెళ్తుంది. కర్ణాటకలో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ రెండవ స్ధానంలో ఉంది. ఈసారి కన్నడ ప్రజలు బిజెపికి పట్టం కట్టేలా తాజా పరిస్ధితి చూస్తే అర్ధమవుతుంది. ఇప్పటికే విడుదలయిన ఫలితాల ప్రకారం చూసుకుంటే బిజెపి ముందంజలో ఉంది. ఇప్పటికే బిజెపి 100కు పైగా సీట్లను కైవసం చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి సిద్దరామయ్య కూడా తన నియోజకవర్గం చాముండేశ్వరిలో వెనకంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మెజార్టీ నియోజక వర్గాల్లో కూడా బిజెపినే ముందంజలో ఉంది.
కాంగ్రెస్ మెజారిటీ ఉన్న స్ధానాలు సుమారు 70లోపే స్దానాలు కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక కర్ణాటకలో మరోసారి అధికారంలోకి రావాలనే ఆశతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఈ ఎన్నికలు దేశంమొత్తం మీద ప్రభావం చూపనున్నాయి. ఒకవిధంగా ఈ ఫలితాలు కాంగ్రెస్ కు తమ భవిష్యత్ ను నిరూపించే విధంగా చెప్పుకొవచ్చు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ పడుతున్న మరో పార్టీ జేడిఎస్ మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు కుమారస్వామి ఈ పార్టీకి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు. ఇక కర్ణాటకలో జేడిఎస్ సీట్లు కూడా కీలకంగా మారనున్నాయి.
పోటాపోటీగా సాగుతున్న కౌంటింగ్ లో బిజెపి , కాంగ్రెస్ లు నువ్వానేనా అన్న రితిలో తలపడుతున్నాయి. కర్ణాటకలో హంగ్ ఎర్పడే పరిస్ధితి వస్తే మాత్రం జేడిఎస్ కింగ్ మేకర్ గా నిలవనుంది. దీంతో బిజెపి మెజార్టీ స్ధానాల్లో గెలవటంతో అధికారం తమదే అని బిజెపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కర్ణాటకలో ఎవరి మద్దతు లేకుండా తాము ప్రభుత్వం ఎర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బిజెపి నేతలు.