కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 40 కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు కొనసాగుతున్నది. హరప్పనమళ్లి స్థానంలో కరుణాకర్ రెడ్డి (బీజేపీ) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రామనగరంలో కుమారస్వామి (జేడీఎస్) ఆధిక్యంలో ఉన్నారు. హోలెనరాసిపురాలో జేడీఎస్ అభ్యర్థి హెచ్ డీ రేవణ్ణ ఆధిక్యంలో కొనసాగుతుండగా..గౌరిబిదనూరులో శివశంకర్ రెడ్డి (కాంగ్రెస్), చిక్ మగుళూరులో బీజీపీ అభ్యర్థి సి.టి. రవి ఆధిక్యంలో ఉన్నారు. వరుణలో సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర (కాంగ్రెస్) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. సాయంత్రం వరకు పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఇటీవలికాలంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఎన్నికలు ఇవేకావడంతో కన్నడనాట విజేత ఎవరనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా, హంగ్ ఏర్పడుతుందంటూ వచ్చిన అంచనాల నేపథ్యంలో జనతాదళ్(ఎస్) ఎన్ని సీట్లతో కింగ్‌మేకర్‌గా నిలుస్తుందన్నదీ ఆసక్తికరంగా మారింది. ఈనెల 12న రాష్ట్రంలోని 222 అసెంబ్లీస్థానాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ అభ్యర్థి మృతి కారణంగా జయపురలో ఎన్నికలను నిలిపివేశారు. ఓటరు గుర్తింపు కార్డులు భారీగా పట్టుబడిన నేపథ్యంలో ఆర్‌ఆర్‌నగర్‌లో పోలింగ్‌ను ఈనెల 28కి వాయిదావేశారు. ఒక్క బెంగుళూరులో ఐదు కేంద్రాలు ఉన్నాయని ఎన్నికల అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రపోలీసులతోపాటు కేంద్ర బలగాలనూ స్ట్రాంగ్‌రూం, కౌంటింగ్ కేంద్రాల వద్ద మోహరించారు. ప్రతీ కౌంటింగ్ కేంద్రం వద్ద ఒక ఎస్పీ స్థాయి అధికారి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు అదనపు డీజీపీ కమల్‌పంత్ తెలిపారు. కాగా హెబ్బల్‌లో ఒక పోలింగ్ కేంద్రం, కుష్టగీలో రెండు పోలింగ్ కేంద్రాల్లో సోమ వారం రీ పోలింగ్ నిర్వహించారు.
కర్ణాటక ఫలితాలు (222)- కాంగ్రెస్ బీజేపీ జేడీఎస్ ఇతరులు
ఆధిక్యం 66 108 43 01
గెలుపు 0 0 0 0