గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న కర్ణాటక బీసీ కమిషన్ బృందం..

39

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల అమలు తీరుతెన్నులపై క్షేత్రస్థాయి పర్యటనకు విచ్చేసినటువంటి కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ బృందం రోజు సిద్దిపేట జిల్లా వర్గల్ లొని మహాత్మ జ్యోతిబాపూలే మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల బీసీ కమిషన్ చైర్మన్లు జయప్రకాష్ హెగ్డే, వకళాభరణం కృష్ణ మోహన్ రావులు అలాగే బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం, ఇరు రాష్ట్రాల కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద పటేల్, సీహెచ్‌ ఉపేంద్, రాజశేఖర్, కళ్యాణ్ కుమార్, సువర్ణ కేటి, అరుణ్ కుమార్, గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.