కర్ణాటకలో పోలింగ్‌ ప్రారంభం..

207
- Advertisement -

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రెండు స్థానాలు మినహా మొత్తం 222 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఎండలు మండిపోతుండడంతో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 8 నుంచి పది పోలింగ్ కేంద్రాలకు ఎస్పీ స్థాయి ఉన్నతాధికారిని నియమించారు.

Karnataka assembly election 2018

222 స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా 58,008 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,984 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక మొత్తం పోలింగ్ బూత్‌లలో 534 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా, 12 వేలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1.5లక్షల మంది పోలీసులు, 50 వేల మంది కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీని తెలిపేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నెల 15న కర్ణాటకలో ఓట్ల లెక్కింపు జరగనుంది.

- Advertisement -