ఆ ప్లేయర్ ఐపిఎల్ మ్యాచ్ లలో కీలకంగా మారాడు. అతడు ఐపిఎల్ లో ఆడిన టీం ప్రతిసారి ఫైనల్ లో కప్ గెలుచుకుంటూ వెళ్తుంది. చివరి మూడు సంవత్సరాల నుంచి అతను ఏ టీంలో ఉంటే ఆ టీం ఫైనల్లో గెలుస్తు వస్తూంది. ఐపిఎల్ ఎవరికి రాని రికార్డు సొంతం చేసుకున్నాడు చైన్నై బౌలర్ కర్ణ్ శర్మ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ట్రోఫీని తీసుకొలేదు. కానీ కర్ణ్ శర్మ మాత్రం వరుసగా మూడు సార్లు ఐపిఎల్ ట్రోఫీని గెలుచుకున్న టీం లలో ఉన్నాడు. 2016, 2017, 2018సంవత్సారాలలో గెలిచిన టీంలలో కర్ణ్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు.
2016ఐపిఎల్ లో కర్ణ్ శర్మ సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడాడు. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై హైదరాబాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ తరపున ఆడిన కర్ణ్ శర్మ కేవలం 5మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఆడిన 5 మ్యాచ్ లలో ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో 2017లో అతనిని వేలంలో తీసుకోలేదు. 2017ఐపిఎల్ లో ముంబాయ్ ఇండియన్స్ యాజమాన్యం అతనిని రూ.5కోట్లకు వేలంలో దక్కించుకుంది. ఆడిన 9మ్యాచ్ లలో 13వికెట్లను తీశాడు కర్ణ్ శర్మ. ఫైనల్ కు వెళ్లిన ముంబాయ్ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ తో విజయం సాధించి మూడోసారి కప్ ను సొంతం చేసుకుంది ముంబాయ్.
ఇక ఈఏడాది జరిగిన వేలంలో చైన్నై టీం అతనిని దక్కించుకుంది. ఈసీజన్ లో కర్ణ్ శర్మ మొత్తం ఆడిన ఆరు మ్యాచ్ లలో 4వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఐపిఎల్ లో ఫైనల్ కు వెళ్లిన చైన్నై సన్ రైజర్స్ హైదరాబాద్ పై విజయం సాధించిందిన విషయం తెలిసిందే. దీంతో కర్ణ్ శర్మ ఇప్పటివరకూ ఏ ఆటగాడు సొంతం చేసుకోని ఘనతను అందుకున్నాడు. వరుసగా మూడేళ్లుగా కప్ తీసుకున్న జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ హ్యాట్రిక్ కొట్టాడు. వచ్చే సంవత్సరం కర్ణ్ శర్మ ఏ టీం తరపున ప్రాతినిధ్యం వహిస్తాడో వేచి చాడాలి.