ఇస్త్రీ చేస్తూ ఓటు అభ్యర్థిస్తున్న వినోద్‌కుమార్‌..

257
TRS MP Candidate Vinod Kumar
- Advertisement -

లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు రాష్ట్రం అంతా జోరుగా ప్రాచారంలో పాల్గొంటు ముందుకెళ్లున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులంతా ప్రచారంలో తమదైన రీతిలో ఓటర్లను ఆకట్టుకోవడంలో బిజీబిజీగా ఉన్నారు. వారి వారి నియోజకవర్గంలోని ప్రతి ఓటరును కలిసి ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు.

అయితే తాజాగా టీఆర్‌ఎస్ తరుపున కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వినోద్ కుమార్ కరీంనగర్‌లోని 44వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. వినోద్‌ కుమార్‌ లాండ్రీ షాప్‌లో వినోద్ ఇస్త్రీ చేస్తూ ఓటు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -