నేడు కరీంనగర్ మేయర్ ఎన్నిక

211
karimnagar

నేడు కరీంనగర్ కార్పోరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగనుంది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఇప్పటికే పాలకవర్గాలు కొలువుదీరగా.. కరీంనగర్‌ పాలకవర్గం మాత్రం బుధవారం ఏర్పాటుకానున్నది. కరీంనగర్ కార్పొరేషన్ లో మొత్తం 60డివిజన్లు ఉండగా 33స్ధానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి ముగ్గురు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు.

వీరిలో ఏడుగురు సభ్యులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. బుధవారం ఉదయం 11 గంటలకు బల్దియా సమావేశ మందిరంలో నూతన కార్పొరేటర్లతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. కోఆప్షన్‌ సభ్యులను ఎన్నుకున్న అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్లను పరోక్ష పద్దతితో ఎన్నుకోనున్నారు.