కరీంనగర్‌ కార్పొరేషన్‌..24న ఎన్నికలు

649
karimnagar
- Advertisement -

కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు మార్గం సుగుమమైంది. సింగిల్‌ జడ్జి తీర్పును హైకోర్టు ధర్మాసనం నిలిపివేసింది. దీంతో కరీంనగర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుతో పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. మొత్తం 60 స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

10 నుంచి 12 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా..13న నామినేషన్లను పరిశీలించనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై14 అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక 16న నామినేషన్ల ఉపసంహరణ జరగనుండగా 24న పోలింగ్….27 న కౌంటింగ్ జరగనుంది. మేయర్ పదవి జనరల్ కు రిజర్వ్ అయింది.

- Advertisement -