మొక్కలు నాటిన కలెక్టర్‌ శశాంక..

158
green india challenge
- Advertisement -

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక హరితహారానికి మద్దతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు కలెక్టర్ శశాంక.

పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ మూడు మోక్కలు నాటాలి, అలాగే అది పెరిగే బాధ్యత కూడా తీసుకోవాలి. దేశ రాజధాని ఢిల్లీ లో కేజీ ఆక్సిజన్ Rs.300 కొనే పరిస్థితి వచ్చింది అంటే మనం పర్యావరణం పైన అశ్రద్ధ చూపుతున్నాం .భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కుని పరిస్థితి ఎవరికి రావద్దు అంటే గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని కోరారు.

ఇలాంటి మంచి పోగ్రాంని ముందుండి నడిపిస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ మా సిబ్బంది మూడు ముక్కలు నాటాలని తెలుపుతున్నాను అలాగే నా సహచరులకు చాలెంజ్ విసుతున్నానని కలెక్టర్ శశాంక గారు అన్నారు. ఈ సందర్బంగా ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -