కరీంనగర్ జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామంలో ఎంపీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదానం క్యాంప్ 11వ రోజుకు చేరింది.ఈ రోజు ముఖ్యఅతిధిగా వచ్చిన వేములవాడ DSP చంద్రకాంత్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి ఒక్కరు విధిగా మస్కులు ధరించాలి , సామాజిక దూరం , వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అని TRS రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు గారు తెలిపారు.
ఈ సందర్బంగా డిఎస్పీ చంద్రకాంత్ గారు మాట్లాడుతు ఆకలి తో అన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది. అన్నదానానికి మించిది లేదని పెద్దలు అంటారు. ధనం, బంగారం దానం చేస్తే దానంగా పొందే వ్యక్తి మరింత అధికంగా ఆశిస్తాడు. అదే అన్నాన్ని దానం చేస్తే కడుపు నిండిన తర్వాత అధికం ఆశించడు. అన్నదానాన్ని చేస్తే భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాలను శుభఫలితాలను ఇస్తుంది. అన్నదానం చేయడం ద్వారా దంపతుల అన్యోన్యత పెరుగుతుంది అభిప్రాయభేదాలు తొలగిపోతాయి అని పురాణాల్లో తెలిపారని ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందించారు .
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఉమకొండయ్య కత్తెరపాక, వైస్ ఎంపీపీ నాగయ్య, SI శ్రీనివాస్, గ్రామశాఖ TRS అధ్యక్షుడు చిక్కల సుధాకర్ రావు, TRS నాకులు ఒద్దెల మహేందర్, బొల్లావేని తిరుపతి, సందుల శ్రీనివాస్, చింతలపల్లి తిరుపతి రెడ్డి, అనుముల భాస్కర్, కత్తెరపాక సుధాకర్, ఆకుల కర్ణకర్, సారంపెళ్లి రవి, కమల్, సిద్ధాంతి కళాధర్, గుండ్ల సాయబు, రాజిరెడ్డి, కత్తెరపాక శ్రీనివాస్* పాల్గొన్నారు