కరీంనగర్‌..ఏరియల్ వ్యూ చేయనున్న సీఎం

35
- Advertisement -

రాష్ట్రంలో కురిసిన అకాలవర్షం కారణంగా తీవ్రంగా పంటనష్టపోయిన కరీంనగర్‌ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మిపూర్‌లోని రైతులను సీఎం కేసీఆర్‌ కలవనున్నారు. లక్ష్మిపూర్‌లో రైతు రాంచంద్రారెడ్డికి చెందిన పంట పొలాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బినోద్‌రావుతో కలిసి బుధవారం పోలీస్ కమిషనర్ అదనపు కలెక్టర్లతో కలిసి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

పంటనష్టంపై సమగ్ర నివేదికతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ జిల్లాకు చేరుకొని తిరిగి వెళ్లేవరకూ పక్క ప్రణాళికను రూపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్లు జి.వి. శ్యామప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, ఇరిగేషన్ అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

మీరేమంటారు..ప్రజలకు కేటీఆర్ ప్రశ్న?

ఆధార్‌ అనుసంధానం పొడగింపు..కేంద్రం

ఏడు వేలు దాటిన యాక్టివ్‌ కేసులు..

- Advertisement -