- Advertisement -
హైదరాబాద్ యూసఫ్ గూడ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ కరాటే పోటీలు బహిష్కరించారు జగిత్యాలకు చెందిన కరాటే ప్లేయర్స్. రెఫరీలు, ఇంఛార్జ్ లు తెలంగాణ వారు లేరు.. మాకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామీణ స్థాయి ప్రభుత్వ పాఠశాలల నుండి వస్తే తమకు అన్యాయం చేస్తున్నారని.. కరాటే లో వివిద క్యాటగిరీల్లో జరిగిన పోటీల్లో డ్రా షీట్లు గోప్యంగా ఉంచుతున్నారు….తమకు న్యాయం జరగాలని కరాటే పోటీలను బహిష్కరించిన జగిత్యాల కరాటే ప్లేయర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం కప్ కాదు… ఆంధ్రా సీఎం కప్ లా ఉందని తమ ఆవేదన వ్యక్తం చేశారు క్రీడాకారులు.
Also Read:TTD: వైకుంఠ ఏకాదశి..విస్తృత ఏర్పాట్లు
- Advertisement -