అతను చెప్పినట్టు చేస్తే రూ.50వేలు ఇస్తా అన్నారుః కరాటే కళ్యాణి

278
Karate Kalyani
- Advertisement -

తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి కరాటే కళ్యాణి. రవితేజ హీరోగా చేసిన కృష్ణ, మిరపకాయ్ లాంటి చిత్రాల్లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. రీసెంట్ గా జరిగిన మా ఎన్నికల్లో కరాటే కల్యాణి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా ఎన్నికైయ్యారు . తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గోన్న కరాటే కళ్యాణి తన జీవితంలో ఎదురైన అనుభవాలు, క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది తెలుగు ఇండస్ట్రీలో మాత్రమే లేదని..ఆడవాళ్లు పనిచేసే ప్రతిచోట ఉంటుందని తెలిపింది. కెరీర్ ప్రారంభంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్తో ఇబ్బందులు పడ్డానని చెప్పారు కరాటే కల్యాణి.

మన ప్రవర్తన, కట్టు, బొట్టుని బట్టే ఎదుటివారు కూడా ప్రవర్తిస్తారు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నైట్ ఫ్రీగా ఉంటావా, బయటకు వెళదామా అని అడిగేవారు. సరదాకేకదా అని నేను కూడా వాళ్లతో వెళ్లేదాన్ని..వాళ్లు అదే అదునుగా చేసుకుని నన్ను ముట్టుకునేవారని చెప్పింది. కానీ అలాంటి పనులని నేను ఎంకరేజ్ చేసేదాన్ని కాదని..ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చింది కేవలం టాలెంట్ నమ్ముకుని మాత్రమే అని తెలిపింది. మనం స్ట్రాంగ్ గా ఉంటె ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు అని కళ్యాణి పేర్కొంది.

తన కెరీర్ లో ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా బాండ్ రాయమని అడిగాడు. నెలకు 50 వేలు జీతం ఇస్తాను. నేను ఏది చెబితే అది చేయాలి. అందుకు తగ్గట్లుగా బాండ్ రాయమని అడిగాడు. నేను కుదరదని చెప్పడంతో తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పాడు. అప్పుడు నేను వెంటనే ఆ రూం ఖాళీ చేసి కొత్త రూం తీసుకున్నానని చెప్పింది . ఆ నటుడు ప్రస్తుతం ఫేడౌట్ అయ్యాడని కళ్యాణి తెలిపింది. అతడు చెప్పినట్లు చేసి ఉంటె ఈ విషయాన్ని నేను ఇంత ధైర్యంగా ఇప్పుడు చెప్పేదాన్ని కాదు అని కళ్యాణి తెలిపింది.

- Advertisement -