పెరుగుతున్న జనాభాను కంట్రోల్ చేసేందుకు గవర్న్‌మెంట్, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే’ అంటూ ఎస్‌జే సూర్య చెబుతున్న ఈ డైలాగ్ స్పైడర్ టీజర్‌లో హైలెట్‌గా నిలిచింది. భయపెట్టడం మాకు తెలుసు..ఆ రోజు అంతమంది మధ్య దాక్కున్నావే అదే భయమంటే అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ అందరిని ఆకట్టుకుంటోంది. ఒక నిమిషం పది సెకన్స్ ఉన్న టీజర్ వీడియో ఫ్యాన్స్ లో మాత్రం భారీ అంచనాలను రేకెత్తించింది. హాలీవుడ్ స్టైల్ లో సినిమాను తెరకెక్కించారని చెబుతున్న ఈ చిత్రంపై మహేష్ తో పాటు దర్శకుడు మురుగదాస్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్పైడర్ ను తెలుగుతో పాటు తమిళ, హింది భాషల్లో కూడా ఒకే తేదీకి విడుదల చేసేందుకు మహేశ్ సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా హిందీ హక్కులు నిర్మాత కరణ్ జోహార్ తీసుకుంటున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమాను హిందీలో డబ్ చేయవద్దని కరణ్ జోహార్ అంటున్నారట..ఎందుకంటే ఈ సినిమాను బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో రీమేక్ చేయాలని అనుకున్న కరణ్.. హిందీలో ఈ సినిమాని డబ్ చేయోద్దని.. స్పైడర్ దర్శకనిర్మాతల్ని పట్టుబడుతున్నాడని తెలిసింది. ఒక వేళ హృతిక్ ఒకే చెబితే హిందీలో భారీ ఎత్తున్న నిర్మించనున్నట్లు సమాచారం.
120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన స్పైడర్ కు బాలీవుడ్ లో కూడా బిజినెస్ జరిగితేనే ఆశించినంత స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి అంటున్నారు ట్రేడ్ నిపుణులు. మరీ కరణ్ జోహార్ ఈ సినిమాను బాలీవుడ్‌లో విడుదల కానీస్తాడా.. లేదా అన్నది మహేష్‌కు కొత్త తలనొప్పిగా తయారైందని ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా, ఒక్క సాంగ్ మినహా సినిమా షూటింగ్ అంతా పూర్తైనట్టు తెలుస్తుండగా, బ్యాలెన్స్ సాంగ్ ని ఈ నెలాఖరులో చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్‌వీ ప్రసాద్, రిలయన్స్ ఎంటర్‌మైంట్ సంస్థలు సంయుక్తంగా స్పైడర్ సినిమాను నిర్మిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.