బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కరణ్ జోహార్ రాసుకున్న ఆత్మ కథ ఆయనను తెగ ఇబ్బంది పెడుతోంది. తాను స్వలింగ సంపర్కుడినేనని తన ఆత్మకథలో కరణ్ అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో కరణ్ ఓ స్వలింగ సంపర్కుడని, ఆయనకు చాలా మంది మగాళ్లతో శృంగార సంబంధాలు ఉన్నాయని బాలీవుడ్ మీడియా ఎప్పటి నుంచో కోడైకూస్తోంది. దీంతో కరణ్ జోహార్ తాజాగా తన బాధనంతా వెళ్లగక్కాడు. కరణ్ కి, వారాంతంలో జరిగే పార్టీల్లోగాని, ఫంక్షన్లలోగాని మగవారితో కలిసి కనిపించాలంటే చాలా భయమేస్తోందట.
మరుసటిరోజు మీడియా వాళ్లతో ఎలాంటి సంబంధాలు అంటగడుతారోనన్న భయమే అందుకు కారణం అంటున్నాడు కరణ్. ఆదివారం ఒకరితో కనిపించగానే..సోమవారం ఉదయానికే ఆ ఫోటోలను ఫ్రంట్ పేజీల్లో వేసేసి ఏదేదో రాసేస్తున్నారు. తనకు, తనతో పాటు ఉన్న మేల్ సెలబ్రిటీలకు సెక్సువల్ రిలేషన్‌షిప్ ఉందని ప్రచారం చేస్తున్నారు అంటూ వాపోయాడు కరణ్. ప్రత్యేకించి షారూక్‌తో తకు సంబంధం ఉందన్నట్టుగా రాసిన వార్తలు కరణ్ ని తీవ్రంగా బాధించాయట.
షారూక్ నాకు తండ్రిలాంటివాడు. అతనితో నన్ను ముడిపెట్టిరాయడం చాలా బాధించిందని కరణ్ తెలిపాడు. మరోవైపు అసలు కరణ్ ఆత్మకథలో స్వలింగ సంపర్కం ప్రస్తావన రాయకుండా ఉండిఉంటే.. పరిస్థితి ఇంత వరకు వచ్చేదా అంటూ బీటౌన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పాపం కరణ్ జోహార్.