కేజ్రీవాల్ రూ.2 కోట్లు లంచం తీసుకుంటుండగా తాను చూశానంటూ కపిల్ మిశ్రా సంచనల ఆరోపణలు చేయడంతో ఆప్‌లో కల్లోలం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఆప్ బహుష్కృత నేత కపిల్ మిశ్రా నేడు మరోసారి సీఎంపై విమర్శలు చేశారు. అంతేకాదు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మిశ్రా బహిరంగ సవాలు విసిరారు. ఎవరు నిజాయితీపరులో ముఖాముఖీ తలబడి తేల్చుకుందాం అంటూ కేజ్రీవాల్ పై ఘాటు వ్యాఖ్యలే చేశారు మిశ్రా. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసిన మిశ్రా.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
ఈ మేరకు కేజ్రీవాల్‌కు బహిరంగ లేఖ రాశారు కపిల్ మిశ్రా. ‘కేజ్రీవాల్ జీ.. నేను మీపైనా.. మీ పార్టీ సభ్యులపైనా కేసు పెట్టేందుకు వెళ్తున్నాను. నన్ను దీవించండి ప్లీజ్. ఈ విషయంపై నేను సీబీఐకి ఫిర్యాదు చేయబోతున్నా. వారికి అన్ని విషయాలు చెప్పేస్తాను’అన్నారు. అంతేకాకుండా దమ్ముంటే ఎన్నికలు పెట్టి నాపై పోటీ చేయండి. దిల్లీలో ఏ ప్రాంతం నుంచి బరిలోకి దిగడానికైనా నేను సిద్ధమే. ప్రజలు మీవైపు ఉన్నారని రుజువైతే.. నేను రాజీనామా చేస్తాను’ అని మిశ్రా పేర్కొన్నారు.
‘మీ పైపు అందరూ ఉన్నారు. నావైపు నేను ఒక్కడినే. అయినా మీతో పోరాటానికి నేను సిద్ధం. అవినీతిపై ఎలా పోరాటం చేయాలో మీనుంచే నేను నేర్చుకున్నాను. అయితే సత్యం కోసం ఈరోజు యుద్ధం చేస్తున్నాను’ అని మిశ్రా పేర్కొన్నారు. అలాగే..ఏ సీటు నుంచైనా తాను పోటీ చేసేందుకు సిద్ధమేనని, ఎవరికి ఓటేయాలో, ఎవరిని గెలుపించుకువాలో ప్రజలే నిర్ణయిస్తారని ఆ లేఖలో ఆయన స్పష్టం చేశారు.
కేజ్రీవాల్‌కు మిశ్రా బహిరంగ సవాల్..
- Advertisement -
- Advertisement -