‘కనుమ’..ఎందుకు జరుపుకుంటారు?

41
- Advertisement -

మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగలో మూడో రోజును కనుమ గా జరుపుకుంటారు. కొన్ని చోట్ల దీనిని ముక్కనుమ అని కూడా అంటారు. ఈ కనుమ పండుగను ముఖ్యంగా పశువులకు కృతజ్ఞతభావంతో జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే రైతుల పండుగ.. ఏడాది అంతా పొలంలో కష్టపడి ధాన్యం ఇంటికి చేసిన సందర్భంగా సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకుంటారు. అయితే పొలంలో రైతులకు సహాయంగా ఎద్దులు కూడా శ్రామిస్తాయి. రైతులకు పంట పండడంలో ఎద్దులు ముఖ్య భూమిక పోషిస్తాయి. వాటి శ్రమకు విశ్రాంతినిస్తూ సంక్రాంతి తర్వాత కనుమగా జరుపుకుంటారు. ఈ కనుమ రోజున పశువులను పూజిస్తూ వాటిని చూడముచ్చటగా అలంకరిస్తారు. ఎద్దులకు పసుపు కుంకుమ పెట్టి మెడలో గజ్జెల పట్టీలు, కాళ్ళకు మువ్వలు వేస్తారు.

ఇంకా ఎద్దుల కొమ్ములకు రంగు రంగుల రిబ్బన్లు, కాగితాలు చుట్టి ఎద్దులను ఎంతో ఆకర్షణీయంగా తయారు చేస్తారు. తరువాత వాటిని ఊరంతా తిప్పుతారు. ఇక ఈ కనుమ రోజున ఇంటికి వచ్చిన బంధు మిత్రులకు మాంసాహారం వండుతారు. అలాగే పితృదేవతలకు నైవేద్యంగా వివిధ రకాల పిండి వంటలు కూడా వండుతారు. అలాగే చాలా చోట్ల కనుమ రోజున ఆటల పోటీలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కోడి పందాలు, బండ లాగుడు, వివిధ రకాల టోర్నమెంట్లు అలాగే పిల్లలు పెద్దలు కలిసి గాలిపటాలు ఎగురవేయడం, ఇలాంటి ఎన్నో నిర్వహిస్తు కనుమను ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకుంటారు. ఇక ఈ కనుమ రోజున ప్రయాణం చేయకూడదని పెద్దలు నమ్ముతారు. కనుమ రోజున ప్రయాణాలు చేయడం వల్ల అరిష్టం అని చాలామంది భావిస్తారు. ఇలా సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున పండుగ క్షోభను పూర్తిగా ఆస్వాదించి సంక్రాంతి పండగకు ముగింపు చెబుతారు.

Also Read:సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు..?

- Advertisement -