కానుగ కషాయం తాగితే ఎన్ని లాభాలో!

533
- Advertisement -

కానుగ చెట్టు గురించి మనందరికీ తెలిసిందే. ప్రతి ఊరులో ఎక్కువగా కనిపించే చెట్లలో ఇవే అధికంగా ఉంటాయి. ఈ చెట్టు నింపైన ఆకులతో గుంపు గా ఉండటం వల్ల మంచి నీడను ఇస్తాయి. తద్వారా పల్లెటూళ్లలో దాదాపు ప్రతి ఇంటి దగ్గర కానుగ చెట్లు ఉండడం గమనిస్తూ ఉంటాము. అయితే ఈ చెట్టు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయనే సంగతి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానుగ చెట్టు ఆకులు, విత్తనాలు, బెరడు వంటి వాటిని పూర్వం నుంచి కూడా ఆయుర్వేద ఔషధాలలో ఉపయోగిస్తున్నారు..

కనుగ చెట్టులోని ప్రతిదీ కూడా చాలా రోగాలకు దివ్యఔషధంలా పని చేస్తుంటాని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చర్మ సంబంధిత వ్యాధులను దూరం చేయడంలో కనుగ ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయట. చర్మంపై గాయాలు గాని దద్దుర్లు గాని ఏర్పడినప్పుడు కనుగ ఆకులను పేస్ట్ లా చేసుకొని దీనికి తేనె లేదా నెయ్యి కలిపి కొద్దిగా సేవిస్తే గాయాల నుంచి రక్తస్రావం ఆగిపోతుంది. ఇక కనుగ ఆకులతో తయారు చేసిన కషాయాన్ని సేవిస్తే గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకం, కడుపులో మంట వంటి సమస్యలు దూరమవుతాయి.

ముఖ్యంగా మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల కారణంగా ఏర్పడే లివర్ సమస్యలను నివారించడంలో కానుగ ఆకు కషాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇంకా మూత్రంలో మంట, మూత్ర రంగు మారడం వంటి సమస్యలకు కూడా కానుగ కషాయం చక్కటి పరిష్కారమట. ఇక హటాత్తుగా వాంతులు ఏర్పడినప్పుడు వేడి వేడి గంజిలో రెండు లేదా మూడు కానుగ ఆకులను వేసి కొద్దిసేపు అలాగే ఉంచి ఆ తరువాత ఆ గంజిని తాగితే వాంతులు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. లేత కనుక ఆకులను పేస్ట్ లా చేసుకొని, ఆవు నెయ్యితో మిశ్రమంగా చేసుకుని, కొద్దిగా వేయించిన గోధుమ పిండితో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి అరుగుదల అవుతుంది. ఇంకా అర్షమొలలు వంటివి తగ్గించడంలో కూడా ఈ చూర్ణం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read:Gold Price:బంగారం ధర ఎంతంటే?

- Advertisement -