కంటి వెలుగు @ కోటి

55
- Advertisement -

కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టిలోపంతో బాధపుడుతున్న వివిధ వయస్సులకు చెందిన తెలంగాణ ప్రజలకు కంటి వెలుగును అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా నిర్వహించే కంటి పరీక్షలు, కంటి అద్దాలు, అవసరమైన వారికి జరిపే కంటి శస్త్ర చికిత్సలు, మందులు తదితరాలు ప్రభుత్వ ఖర్చుతో పూర్తి ఉచితంగా అందజేయనుంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. ఇవాళ్టితో కోటికి చేరాయి కంటి పరీక్షలు. సదాశివపేటలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, హెల్త్ కమిషనర్ శ్వేతా మహంతి,కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ రెడ్డి పాల్గొన్నారు.

కోటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా బెలూన్లను గాల్లో ఎగురవేశారు హరీశ్. జనవరి 18 2023న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం అయింది.కంటి వెలుగు కోటి పరీక్షలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు హరీష్ రావు.

ఈ పథకాన్ని ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా తెలంగాణలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు, మందులను అందజేస్తుంది.

ఈ పథకాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రారంభించారు. రెండో విడతకంటి పరీక్షల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రలు పినరయి విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌తోపాటు ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా కలిసి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించి, కంటి వెలుగు లబ్ధిదారులకు కంటి అద్దాలను అందజేశారు.

- Advertisement -