Kanti Velugu:గొప్ప కార్యక్రమం

200
- Advertisement -

కంటి వెలుగు గొప్ప కార్యక్రమం అన్నారు మంత్రి హరీశ్‌ రావు. తెలంగాణలో కోటి పరీక్షలు పూర్తి చేసుకుంది కంటి వెలుగు కార్యక్రమం. సదాశివపేటలో కంటి వెలుగు కార్యక్రమాన్ని పరిశీలించారు. కోటి పరీక్షలు పూర్తయిన సందర్భంగా బెలూన్లను గాల్లో ఎగురవేశారు. జనవరి 18 2023న ప్రారంభం అయింది రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు హరీశ్.

కోటి కంటి పరీక్షలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు హరీశ్‌.ఈ రోజు గొప్ప రోజు…కంటి వెలుగు ద్వారా 29 లక్షల మందికి కళ్ళ జోడ్లు ఉచితంగా ఇచ్చామన్నారు. ప్రజల ఇబ్బందులు గమనించి, కంటి భాద ల నుండి విముక్తి కోసం సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం తీసుకువచ్చారన్నారు. ప్రపంచంలో కంటి వెలుగు తరహా కార్యక్రమం లేదన్నారు. ఊరు ఊరు వాడ వాడ కు డాక్టర్లు, యంత్రాలు పంపి కంటి వెలుగులను ప్రసాదించారన్నారు. ప్రతిపక్షాలు సైతం మెచ్చు కున్న పథకం కంటి వెలుగు అన్నారు.

సీఎం లు కేజ్రీవాల్, మాన్ సింగ్ మెచ్చు కున్నారన్నారు. 50 వ పనిదినం నాడు కోటి మంది కి పరీక్షలు చేశారన్నారు. 1500 మంది కంటి వెలుగు టీమ్స్ కష్టపడి పని చేశారన్నారు. ప్రతి ఇంటిలో సీఎం కేసీఆర్ సంక్షేమ కార్యక్రమము ఉన్నాయన్నారు. 53 లక్షల మంది మహిళలు , 47 లక్షల పురుషులు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామన్నారు. 7000 గ్రామపంచాయతీ లలో పరీక్షలు కంటి వెలుగు పరీక్షలు చేశామన్నారు.

55 శాతం గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేశామన్నారు. దగ్గర చూపుతో ఇబ్బంది ఉన్న 16 లక్షల 50 వేల మందికి అద్దాలు ఉచితంగా ఇచ్చామన్నారు.దూరపు చూపు సమస్య ఉన్న 12 లక్షల 50 వేల మందికి అద్దాలు ఇచ్చామన్నారు. 250 కోట్లు ఖర్చు పెట్టి ప్రజల కోసం కంటి వెలుగు పథకం అమలు చేస్తున్నామన్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -