కన్నడ సినీ ఇండస్ట్రీలో చిన్న సినిమాగా వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా కాంతార. రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ చిత్రం విడుదలై భారీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. హోంబలే ఫిలింస్ బ్యానర్ విజయ్ కిరగందూర్ నిర్మించారు.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానుండగా ఇందుకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఇవాళ రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా కాంతార చాప్టర్ 1 నుంచి మేకర్స్ ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కవచం తో యుద్ధం చేస్తున్న రిషబ్ శెట్టి మనకు ఈ పోస్టర్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను రిషబ్ శెట్టి మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు రిషబ్. అక్టోబర్ 2న గ్రాండ్‌గా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Also Read:బీజేపీలో ‘కొండా’ కలకలం!

