కాంతార చాప్టర్ 1..తమిళ రైట్స్!

15
- Advertisement -

రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన కాంతార సినిమా అద్భుతమైన విజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం కన్నడలోనే కాకుండా, తెలుగు మరియు హిందీ ప్రేక్షకుల మనసును కూడా గెలుచుకుంది. ఇప్పుడు దాని ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1 పై ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది.

తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ సుమారు రూ.100 కోట్లకు అమ్ముడవుతున్నాయి అనే వార్త షాక్ కలిగించింది. తాజా సమాచారం ప్రకారం, తమిళనాడు రైట్స్ కూడా ఏకంగా రూ.32 కోట్లకు అమ్ముడైందని తెలుస్తోంది.

మొదటి భాగం తమిళనాడులో సుమారు రూ.6 కోట్ల షేర్ మాత్రమే సంపాదించింది. కాబట్టి ఇంత భారీ మొత్తానికి రైట్స్ అమ్మడం ఒక రిస్కీ నిర్ణయం అని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా, కాంతార: చాప్టర్ 1 కి ధనుష్ నటించిన “ఇడ్లీ కడై” సినిమా టఫ్ పోటీగా రానుంది.

Also Read:ఉప ఎన్నికలు రావడం ఖాయం:జగదీష్ రెడ్డి

- Advertisement -