భారీ బడ్జెట్‌తో Kantara 2!

28
- Advertisement -

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార. చిన్న సినిమాగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. కన్నడలోనే కాదు విడుదలైన అన్ని భాషల్లో రికార్డు వసూళ్లను రాబట్టింది. 25 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది.

ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా కాంతార 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ జరుపుకుంటుండగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక భారీ అంచనాలు ఈ సినిమా సీక్వెల్‌పై ఉండగా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.

ఇందులో భాగంగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కించనున్నారట. కాంతార సినిమా రూ.25 కోట్లతో తెరకెక్కగా సీక్వెల్‌ని రూ.125 కోట్లతో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పుడు ఈ న్యూస్ కన్నడ ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది.

Also Read:Varalakshmi Vratham:వరాలందించే తల్లి..వరలక్ష్మీ దేవి

- Advertisement -