Kannappa:కన్నప్ప ట్విట్టర్ రివ్యూ

32
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం.

సినిమా చూసిన నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ యావరేజ్, ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని రిపోర్టులు వస్తున్నాయి. సెకండాఫ్‌ కీలకంగా మారుతుందని, ప్రభాస్ ఎంట్రీకి పూనకాలు గ్యారెంటీ అని చెబుతున్నారు.

సినిమా అంతా అమాయకత్వం, భక్తితో నిండి ఉంటుందట. ఫస్ట్ హాఫ్ ఏమీ అంత లేకపోయినా.. ఇంటర్వెల్ నుంచి పికప్ అవుతుందని చెబుతున్నారు. ఇక సెకండాఫ్ మాత్రం అద్భుతంగా ఉంటుందట. ప్రభాస్ స్పెషల్ రోల్, ఇతర స్టార్ హీరోల కారెక్టర్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయట. సెకండాఫ్ మాత్రం ఈ మూవీకి ప్రాణం అని, అందులోనూ ప్రభాస్ పాత్ర ఈ చిత్రానికి గుండెకాయలాంటిదని అంటున్నారు. అసలు క్లైమాక్స్‌లో విష్ణు యాక్టింగ్ కూడా చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుందని, అద్భుతంగా నటించేసి ఏడిపించేశాడని చెబుతున్నారు.

 

- Advertisement -