2025లోనే కన్నప్ప!

4
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ప్రమోషన్ కోసం వినూత్నంగా ప్రతీ సోమవారం ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు విష్ణు. ఇలా ఇప్పటివరకు బ్రహ్మానందం, సప్తగిరి,శరత్ కుమార్, మధుబాల, దేవరాజ్, ముఖేష్ రిషి, మంచు అవ్రామ్, అర్పిత్ రంకా, అక్షయ్ కుమార్, తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి, మారెమ్మ పాత్రకు సంబంధించిన నటి ఐశ్వర్య లుక్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అయితే తొలుతీ సినిమాను డిసెంబర్‌లో పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు విష్ణు.

కానీ ఈ సినిమాను డిసెంబర్‌లో రిలీజ్ చేయడం లేదని మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మాట్లాడిన విష్ణు…కన్నప్ప చిత్రాన్ని డిసెంబర్‌లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రాన్ని సమ్మర్ 2025లో తీసుకొస్తున్నాం అని మంచు తెలిపారు.

Also Read:‘కుబేర’.. ఫస్ట్ గ్లింప్స్

- Advertisement -