విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నప్ప చిత్రాన్ని ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించినా తాజాగా రిలీజ్ డేట్ ఛేంజ్ అయింది.
ఈ సినిమాను అద్భుతమైన వీఎఫ్ఎక్స్ వర్క్‌తో తెరకెక్కిస్తున్నామని.. దీని కోసం మరికొన్ని వారాల సమయం పడుతుందని.. మంచి క్వాలిటీతో ఈ సినిమాను ప్రేక్షకులకు అందించాలని తాము కష్టపడుతున్నామని.. అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నట్లు విష్ణు మంచు వెల్లడించారు.
త్వరలోనే ఈ సినిమాను బెస్ట్ అవుట్‌పుట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని.. త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Also Read:ప్రవాసీ మిత్ర..గల్ఫ్ భరోసా

