విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమా భారీ ఎత్తున రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్లో మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ వస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లు, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్‌కి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మంచు విష్ణు. ఫిబ్రవరి 3 న రెబల్ స్టార్ ప్రభాస్ లుక్‌ను విడుదల చేస్తామని ఓ పోస్టర్ ద్వారా చెప్పింది. ఈ పోస్టర్‌లో త్రిషూలం వెనుక ప్రభాస్ కన్నులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆయన నుదిటిపై ఉన్న బొట్టు మండుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
మోహన్ బాబు, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మధుబాల తదితరులు నటిస్తుండగా ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also read:రవితేజ.. ‘మాస్ జాతర’