- Advertisement -
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
ట్రైలర్ రన్ టైం ఇప్పుడు లాక్ అయ్యినట్టు తెలుస్తోంది. మొత్తం 2 నిమిషాల 55 సెకండ్ల నిడివితో అంచనాలు పెంచే విధంగా ఉండబోతుందట. అలాగే ఈ ట్రైలర్ ని మోహన్ లాల్ విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.
Also Read:రాజాసాబ్..టీజర్ లీక్!
- Advertisement -

