- Advertisement -
కన్నప్ప సినిమా హార్డ్ డ్రైవ్ మాయమైంది. 24 ఫ్రేమ్స్ సంస్థ ఉద్యోగులపై నమ్మక ద్రోహం కేసు నమోదు చేశారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రెడ్డి విజయ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు.
కన్నప్ప సినిమాకు చెందిన అత్యంత కీలకమైన కంటెంట్ ఉన్న హార్డ్ డ్రైవ్‌ను, ఫిల్మ్ నగర్ లోని ఫోర్ ఫ్రేమ్స్ సంస్థకు డీటీడీసీ కొరియర్ ద్వారా పంపింది ముంబాయి హెచ్ఐవీఈ స్టూడియోస్. ఆ పార్సిల్ ను ఈ నెల 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకొని చరిత అనే మహిళకు అందించాడని, అప్పటి నుండి వారిద్దరు కనిపించడంలేదని తెలిపింది ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ.
కొంతమంది పెద్దవాళ్ళు తమ సినిమాకు నష్టం కలిగించడానికి కుట్ర చేస్తున్నారని, వారిద్దరిని పట్టుకొని చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఫోర్ ఫ్రేమ్స్ సంస్థ.
Also Read:TTD:జూన్ నెలలో విశేష పర్వదినాలు
- Advertisement -

