విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీ మాతగా కాజల్ నటిస్తోండగా మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం , ప్రభాస్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఈ మూవీ అనేక వాయిదాలు పడుతూ జూన్ 27 రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఫస్ట్ లుక్స్, గ్లిమ్స్ విడుదల చేసిన మేకర్స్ తాజాగా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో సినిమాపై క్యూరియాసిటీని మరింతగా పెంచేలా ఉంది.
పూర్తిగా న్యూజిలాండ్‌లోనే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం విజువల్స్ చూస్తుంటే మైండ్‌బ్లోయింగ్‌లా ఉన్నాయి. విష్ణు తనయుడు అవ్రామ్ భక్త మంచు తిన్నడు పాత్రతో ఈ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కూతుర్లు అరియానా, వివియానా ఓ నృత్యరూపక పాటలో కనిపించనున్నారు.
Also Read:దేవుడు వరమిచ్చినా..పూజారి వరమివ్వలేదు!

