కన్నప్ప..బుకింగ్స్ షురూ!

4
- Advertisement -

మంచు విష్ణు ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రానికి సంబంధించిన ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్ చాలా చోట్ల ఓపెన్ అయ్యాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ కావడంతో అక్కడ ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 5,400 స్క్రీన్లలో కన్నప్ప రిలీజ్ కానుంది.

దేశంలో ఈ సినిమాను 4,300కు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్‌లో 1,100పైగా స్క్రీన్లు, 200లకు పైగా యూస్ ప్రీమియర్ లను ప్లాన్ చేశారు.

భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ‘కన్నప్ప’ చిత్రం ఓపెనింగ్ డేకి రికార్డులు క్రియేట్ చేసేలా కనిపిస్తుంది. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ బాబు, ఆర్.శరత్‌కుమార్, బ్రహ్మానందం వంటి స్టార్స్ నటించారు. మంచు విష్ణు భారీ ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.

Also Read:అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడి

- Advertisement -