- Advertisement -
మర్డర్ కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. రేణుక స్వామి అనే వ్యక్తి మర్డర్ కేసులో నటుడు దర్శన్ తో పాటు మరో 10 మందిని పో మైసూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
నటి పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపడం, సోషల్ మీడియాలో ఆమెపై కామెంట్స్ చేయడంతో రేణుక స్వామిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే పవిత్ర గౌడకు చెందిన ఓ షెడ్ లో రేణుక స్వామి హత్య జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో దర్శన్‌తో పాటు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పవిత్ర గౌడ,దర్శన్ మధ్య ఎఫైర్ ఉందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
Also Read:జనసేన శాసనసభా పక్ష నేతగా పవన్..
- Advertisement -