ఆశ్చర్యపరుస్తున్న కన్నడ హీరోలు.. వారంతా రియల్లీ గ్రేట్ !

122
- Advertisement -

కన్నడ ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు చిన్న చూపు ఉండేది. పక్కన ఉన్న తెలుగు – తమిళ ఇండస్ట్రీలు కూడా కన్నడ సినీ వైభోగాన్ని హర్షించలేదు. అలాంటి ఇండస్ట్రీ నేడు భారతీయ సినీ లోకంలో రెండు చరిత్రలను సృష్టించింది. కేజీఎఫ్ మొదటిది, కాంతార రెండోది. ఈ రెండు సినిమాల గురించి ఏమైనా చెప్పొచ్చు. యాక్షన్ లవర్స్ అయితే ఇప్పటికీ కేజీఎఫ్ హ్యాంగోవర్ నుంచి తేరుకోలేదు. ఇక కాంతార సినిమా హిందీ ప్రేక్షకుల మీద వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. ఈ రెండు చిత్రాలకు ఆ స్థాయిలో కనెక్ట్ అయిపోయారు జనం. నిజానికి ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా కథలు కాదు.

కాంతార నేపథ్యం కర్ణాటక కోస్తా ప్రజలకే పరిమితం. అలాగే కేజీఎఫ్ చరిత్ర కూడా కర్ణాటక కాల ప్రవాహంలో ఎప్పుడో చరిత్రలో కలిసిపోయింది. మరి కర్ణాటక తాలూకు లోకల్ కంటెంట్ పాన్ ఇండియా వాణిజ్య సూత్రాలనే ఎలా పెకిలించి వేసింది ?, ఉదాహరణకు.. కాంతార సంగతి తీసుకుంటే.. ఎక్కడ 16 కోట్లు, ఎక్కడ 410 కోట్లు… ఇంకా తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో అద్భుతంగా నడుస్తోంది. గ్రేట్. అంతా ఆనందం. కానీ ఇక్కడ ఓ విషయం మాత్రం హిందీ సినీ ప్రముఖుల్నే ఆశ్చర్యపరుస్తోంది. హిందీ సినిమాలో హీరోగా అవకాశం వస్తే.. ఏ నటుడు మాత్రం కాదనుకుంటాడు ?, కానీ.. కన్నడ హీరోలు మాత్రం తమకు బాలీవుడ్‌ పనికిరాదని పక్కాగా చెప్పేస్తున్నారు.

ఎవరేమనుకుంటే తనకేమి..?, తమకు కావాల్సింది కన్నడ సినీ పరిశ్రమ అన్నట్టు ఉంది వారి ధోరణి. యశ్ కి ఎన్నో హిందీ చిత్రాలు వచ్చాయి. కానీ యశ్ మాత్రం ఏ హిందీ సినిమా పై ముచ్చట పడలేదు. ఇప్పుడు రిషబ్ శెట్టి వంతు వచ్చింది. ఆయనకు బోలెడు హిందీ ఆఫర్లు వచ్చిపడుతున్నయ్. అయినా రిషబ్ శెట్టి మాత్రం దేనికీ కమిట్ కావడం లేదు. యశ్ అయినా కావొచ్చు, రిషబ్ శెట్టి అయినా కావొచ్చు.. గతంలో ఉపేంద్ర అయినా కావొచ్చు. వీరంతా కన్నడ హీరోలే కాదు, కన్నడ ప్రేమికులు కూడా.

కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయడానికి ఎంతెంత కష్టపడ్డారు ?, హీరోలుగా రాణించడానికి ఎంత కాలాన్ని, వయస్సును ధారపోశారు ?, కన్నడ సినిమా కోసం సగం జీవితాన్నే ఇచ్చేశాం ?, అలాంటిది ఇప్పుడు ఉన్నట్టు ఉండి కన్నడ సినీ లోకానికి ఎలా చుట్టాలుగా మారతాం ?, కన్నడ సినీ ఇండస్ట్రీనే తమ లోకం అంటూ సాగిపోతున్న కన్నడ హీరోలకు ఆల్ ది బెస్ట్. మరి ఈ విషయంలో తెలుగు హీరోల పరిస్థితి గురించి ముచ్చట అనవసరం.

ఇవి కూడా చదవండి…

సింగర్ గా బిజీ అవుతున్న కోలీవుడ్ హీరో

మహేష్ కోసం ఒప్పేసుకుంది

పవన్ సొంత కథ… వామ్మో !

- Advertisement -