తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ఫెంటాస్టిక్ ఫైవ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జూన్ 24వ తేది సోమవారం నుండి 28వ తేది శుక్రవారం వరకు గిరీష్ కర్నాడ్ ఫిలిం ఫెస్టివల్ ను జరుపనున్నారు.
ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ…. భారత అత్యున్నత పురస్కారాలైన పద్శశ్రీ, పద్శ భూషణ్, జ్ఞానపీఠ్ అవార్డులు అందుకున్న గిరీష్ కర్నాడ్ తన రచనలతో సాహిత్యరంగంలో, నటనతో సినిమారంగంలో చెరగని ముద్రవేసారని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గిరీష్ కర్నాడ్ కి నివాళిగా ఈ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని, ఆయన తీసిన సినిమాల్లోంచి ఉత్తమమైన 10 సినిమాలను ఎంపికచేసి ప్రతిరోజు రెండు సినిమాల (మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6 గంటలకు) చొప్పున 5 రోజులు 10 సినిమాలను ప్రదర్శిస్తున్నామని తెలిపారు.
సినిమాను ఒక కళగా భావించి రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా అనేక సినీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొంటూ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న ఈ ఫిలిం ఫెస్టివల్ కి గిరీష్ కర్నాడ్ అభిమానులు, సినీప్రియులు విచ్చేసి సినిమాలను వీక్షించి, ఫిలిం ఫెస్టివల్ ను విజయవంతంచేయాలని కోరారు.
ప్రదర్శనల వివరాలు
సోమవారం (24.06.2019)
మ. 2 గంటలకు – సంస్కార (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – వంశవృక్ష (కన్నడ)*
మంగళవారం (25.06.2019)
మ. 2 గంటలకు – కాడు (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – మంథన్ (హిందీ)
బుధవారం (26.06.2019)
మ. 2 గంటలకు – స్వామి (హిందీ)
సా. గం. 6.30 ని.లకు – ఉంబర్త (మరాఠి)
గురువారం (27.06.2019)
మ. 2 గంటలకు – ఆనందభైరవి (తెలుగు)
సా. గం. 6.30 ని.లకు – సూత్రధార్ (హిందీ)
శుక్రవారం (28.06.2019)
మ. 2 గంటలకు – నాగమండల (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – ఉత్సవ్ (హిందీ)