‘దండుపాళ్యం-2’లో ముద్దు మీద ముద్దు..!

272
Kannada Actress Pooja Gandhi Liplock in Dandupalyam 2 .

న్యూడ్ షో తో ఇప్పటికే సంజన వార్తల్లోకి వచ్చిన తెలిసిందే. ఈ వార్తతో ‘దండుపాళ్యం-2’ సినిమా కి తెగ పబ్లిసిటీ వచ్చేసింది. న్యూడ్‌ షో తో వివాదాన్ని తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు అంతకు మించిన హాట్ సీన్ తో చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ కట్ అయిన సంజన న్యూడ్ షో సీన్ ను లీక్ చేసి ఈ సినిమాకు కావాల్సినంత ప్రచారాన్ని తెచ్చుకున్నారు దీని రూపకర్తలు.

Kannada Actress Pooja Gandhi Liplock in Dandupalyam 2

అలాగే ఇదే సినిమాకు సంబంధించి మరో లీక్ కూడా నెట్ లో షికారు చేస్తోంది. ఇదొక కిస్ సీన్. మామూలు కిస్ సీన్ కాదు. లెస్బియన్ ముద్దు సీను, అదికూడా లిప్ లాక్ సీన్‌.!

కన్నడలో పరమ కిరాతకమైన దొంగల ముఠా కథగా ‘దండుపాళ్యం’ సినిమా వచ్చింది. ఈ సినిమా తెలుగులోకి అనువాదం అయ్యింది. ఒళ్లు గగొర్పొడిచే హింసాత్మక సన్నివేశాలున్న ఈ సినిమా కొందరికి నచ్చింది కూడా. కలెక్షన్లు కూడా బాగా రావడంతో రెండో పార్టు వస్తోంది. ఈ సారి హింసనే కాకుండా.. హాట్ సీన్లను కూడా దట్టించినట్టున్నారు. సంజన వీడియోతో పాటు, పూజాగాంధీ లిప్ కిస్ సీన్ కూడా దండుపాళ్యం-2 కి ప్రచారాన్ని తెచ్చిపెడుతోంది.

 Kannada Actress Pooja Gandhi Liplock in Dandupalyam 2

జైల్లో.. పూజాగాంధీకి మరో మహిళకు మధ్య ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించారు. వారిద్దరూ ఖైదీల దుస్తుల్లోనే ఉన్నారు. ఇండియాలో లెస్బియన్ సీన్లున్న సినిమాలన్నీ వివాదాల పాలయ్యాయి. ఇప్పుడు దండుపాళ్యం-2 కూడా అలాంటి వివాదాన్నే ఎదుర్కొంటోంది.

అయితే.. జైళ్లలో ఇలాంటివి జరుగుతున్నాయని.. వాటినే తమ సినిమాలో ప్రస్తావించామని..ఈ సినిమా రూపకర్తలు అంటున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా..విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకున్న ‘దండుపాళ్యం 2’ విడుదల తర్వాత ఎలాంటి టాక్‌ ని తెచ్చుకుంటుందో చూడాలి మరి.