కన్నడ హీరో దంపతులకు కరోనా..!

233
kannada actor
- Advertisement -

కరోనా ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం అందరిని ఆందోళన కలిగిస్తుండగా ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు.

ఇప్పటికే బాలీవుడ్ నటుడు అమితాబ్ ఫ్యామిలీలో నలుగురికి కరోనా సోకగా తాజాగా కన్నడ హీరో ధృవ్ సర్జా అతడి భార్య ప్రేరణ కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ధృవ్.

తనకు, తన భార్యకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్‌లు చేయించుకోగా.. ఇద్దరికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ధృవ్ తెలిపారు.అయితే అభిమానులు అధైర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తామనే నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.తనతో కాంటాక్ట్ అయిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు.

- Advertisement -